: ఆ బిల్లు వల్ల భారత్ కే కాదు, అమెరికా సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీకీ ముప్పే!
అమెరికా సెనేట్ ఆమోదించిన సమగ్ర వలస సంస్కరణ బిల్లు వల్ల భారత కంపెనీలే కాకుండా అమెరికా కంపెనీలు కూడా నష్టపోతాయని సాఫ్ట్ వేర్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) వెల్లడించింది. వలస బిల్లు టీసీఎస్ లాంటి కంపెనీలతో పాటు అమెరికన్ కంపెనీలను ప్రభావితం చేస్తుందని టీసీఎస్ ఎంబీ ఎన్ చంద్రశేఖరన్ మీడియాకు తెలిపారు. సమగ్రవలస బిల్లు అమలులోకి వచ్చేందుకు చాలా దశలను పూర్తి చేసుకోవాల్సి ఉందని, ఆమోదంతో తొలి దశ ముగిసిందని ఆయన అభిప్రాయపడ్డారు. 11 మిలియన్ వలసదారులకు అధికారిక పౌరసత్వం ఇచ్చేందుకు సేనేట్ అంగీకరించగా వారిలో 2.40 లక్షల మంది భారతీయులేనని సమాచారం. అయితే ఈ చట్టం వల్ల హెచ్ 1 బీ వీసాల జారీ ప్రభావం చూపే అవకాశముందని ఆ కంపెనీ అభిప్రాయపడింది.