: నిరుద్యోగులకు నిజంగా శుభవార్తే!
రాష్ట్ర సర్కారు.. నిరుద్యోగులకు తీపి కబురు వెల్లడించింది. ఉద్యోగనియామకాల వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అది 34 సంవత్సరాలు ఉండగా మరో రెండేళ్ళ వెసులుబాటు కల్పిస్తూ.. ఉద్యోగ నియామకాల వయోపరిమితిని 36 ఏళ్ళకు పెంచింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ పరిమితిని 39 ఏళ్ళకు పెంచాలని గతకొంతకాలంగా నిరుద్యోగ సంఘాలు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.