: నడుస్తున్న రైల్లోనే ప్రసవం
నడుస్తున్న రైల్లోనే ఓ బిడ్డకు జన్మనిచ్చిందో తల్లి. అయితే ఆ సమయంలో వైద్యం అందక ఆ బిడ్డ వెంటనే కన్నుమూశాడు. ఢిల్లీకి చెందిన సీమా అనే గర్భిణి ఉత్తర ప్రదేశ్ వెళ్లడానికి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రైలెక్కింది. రైల్లో కొంత దూరం ప్రయాణించగానే నొప్పులు మొదలయ్యాయి. అయితే, అవి సాధారణమైనవే అనుకుంది. కానీ ఘాజియాబాద్ సమీపంలోకి వచ్చేసరికి నొప్పులు ఎక్కువై బిడ్డను ప్రసవించేసింది సీమా. వైద్యం సదుపాయం లేకపోవడంతో ఆ బిడ్డ కన్నుమూశాడు.