: డోపింగ్ చేయకుండా గెలవడం అసాధ్యం: నీల్ ఆర్మ్ స్ట్రాంగ్


డోపింగ్ చేయకుండా టూర్ డీ ఫ్రాన్స్ గెలవడం అసాధ్యమని మారధాన్ సైక్లిస్ట్ నిషేధిత విజేత లాన్స్ అర్మ్ స్ట్రాంగ్ తెలిపాడు. ఫ్రాన్స్ లోని పారిస్ లో అతను మాట్లాడుతూ, డోపింగ్ కు పాల్పడకుండా సాధారణ టోర్నీలను గెలవడం సాధ్యపడుతుంది కానీ అతిపెద్దదైన టూర్ డీ ఫ్రాన్స్ గెలవడం అసాధ్యమని అన్నాడు. 1999 నుంచి 2005 వరకూ విజేతగా నిలిచిన ఆర్మ్ స్ట్రాంగ్ ఇప్పుడు తన జెర్సీని కూడా ధరించేందుకు ఎవరూ ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్మ్ స్ట్రాంగ్ వ్యాఖ్యలపై ఐదుసార్లు విజేతగా నిలిచిన బెర్నార్డ్ హానిల్ట్ స్పందించి ఆర్మ్ స్ట్రాంగ్ డోపింగ్ చేయకుండా విజేతగా నిలవడం ఎలాగో తెలుసుకోవాలని, అంతే కానీ విజేతలను కించపరచడం సరికాదని సూచించాడు.

  • Loading...

More Telugu News