: చేపలు తింటే బ్రెస్ట్ కేన్సర్ దూరం!


చేపల్లో ఉండే కొవ్వు బ్రెస్ట్ కేన్సర్ నూ దూరం చేస్తుందని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. ఆ కొవ్వులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మహిళల్లో రొమ్ము కేన్సర్ ముప్పును గణనీయంగా తగ్గిస్తాయని చైనాలోని ఝెజియాంగ్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. వారానికి రెండుసార్లు టూనా, సాల్మన్, సార్డైన్ వంటి చేపలను ఆహారంగా తీసుకుంటే.. ఎన్-3 అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ శరీరానికి అందుతుందని.. దాంతో, బ్రెస్ట్ కేన్సర్ దరిచేరదని పరిశోధనకు నాయకత్వం వహించిన డ్యూ లీ వివరించారు. ఈ కారణంగానే చేపలు ఎక్కువగా తినే ఆసియా వాసుల్లో రొమ్ము కేన్సర్ తక్కువని అన్నారు. ఇక చేపలు తక్కువగా తినే యూరోపియన్లను ఈ మహమ్మారి ఎక్కువగా కబళిస్తుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News