: సాక్షి పత్రిక అబద్ధాలు ప్రచురిస్తోంది: సోమిరెడ్డి


సాక్షి పత్రికపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ పత్రిక అవాస్తవాలను ప్రచురిస్తోందని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్టుకు భూకేటాయింపులకు సంబంధించి జీవోలు లేకున్నా ఉన్నట్టు ప్రచురించారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ.. 4,700 ఎకరాలు కేవలం నోటిమాట ఆధారంగా కేటాయించారని.. ఈ వ్యవహారంలో లేని జీవోలను సృష్టించారని సోమిరెడ్డి మండిపడ్డారు. సాక్షిలో ప్రచురించిన 223, 300 నెంబరు జీవోల్లో కృష్ణపట్నం పోర్టు భూకేటాయింపుల వివరాలేవీ లేవని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News