: 115 మంది తెలుగువారి ఆచూకీ గల్లంతు


రాష్ట్రానికి చెందిన 115 మంది చార్ ధామ్ యాత్రీకుల ఆచూకీ గల్లంతైందని విపత్తు నిర్వహణ శాఖాధికారి వెల్లడించారు. ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు 2,785 మంది తెలుగు వారు వెళ్లారని, అందులో 1879 మంది యాత్రీకులు క్షేమంగా ఇళ్లకు చేరారని ఆ శాఖ కమీషనర్ రాధ తెలిపారు. కాగా, తమ క్షేమ సమాచారం తెలిపినవారు మరో 778 మందని అన్నారు. అయితే, ఇంకా ఆచూకీ లభించని వారు మాత్రం 115 మంది అని స్పష్టం చేశారు.

విపత్తు నిర్వహణశాఖ లెక్కల ప్రకారం హైదరాబాద్ నుంచి 38 మంది గల్లంతవగా, రంగారెడ్డి నుంచి 35 మంది ఆచూకీ లేదు. కృష్ణా జిల్లా నుంచి 14 మంది ఏమయ్యారో ఇంకా తెలియదు. వైజాగ్ నుంచి 7 మంది మిస్సయ్యారు. చిత్తూరుకు చెందిన ఐదుగురు ఆచూకీ లేరు. పశ్చిమగోదావరి, అనంతపురం జిల్లాల నుంచి ముగ్గురు చొప్పున ఏమయ్యారో తెలియలేదు. గుంటూరు, కడపలకు చెందిన నలుగురు చొప్పున యాత్రీకుల వివరాలు తెలియలేదన్నారు.

  • Loading...

More Telugu News