: నేతల నాలుక వారిష్టం!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశం విషయంలో కాంగ్రెస్ నేతలు క్రమంగా మాట మారుస్తున్నారు. కేంద్ర మంత్రి పదవి అలంకరించిన తర్వాత కావూరి సాంబశివరావు తెలంగాణపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా సరే, కట్టుబడి ఉంటామని ప్రకటించేశారు. అదేంటీ, మొన్నటి వరకూ సమైక్యాంధ్ర అన్నారుగా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించేసరికి.. వ్యక్తిగత అభిప్రాయంతో పనిలేదని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మరోమారు స్పష్టం చేశారు. మంత్రి పదవిని ముందే ఊహించానని చెప్పారు. ఇన్నాళ్లూ తెలంగాణపై పెద్దగా మాట్లాడని పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ కూడా స్పందించారు. రాష్ట్రం విడిపోయినా తెలుగు వారమంతా మానసికంగా ఒక్కటిగానే ఉంటామని అన్నారు. పనిలో పనిగా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న మిగతా నేతల ప్రకటలను కూడా డీఎస్ స్వాగతించారు.