: మాధురీ దీక్షిత్ ఐటం గీతం చేస్తోంది
బాలీవుడ్ డ్యాన్సింగ్ స్టార్, అందాల నటి మాధురీ దీక్షిత్ మరోసారి ఐటమ్ గీతానికి చిందేయనుంది. ఇటీవల కాలంలో 'ఏ జవానీ హై దివానీ' సినిమాలో తొలిసారిగా ఐటం గీతంలో నర్తించిన మాధురీ మంచి మార్కులు కొట్టేసింది. ఈ నేపథ్యంలో మాధురితో 'దేవదాస్' సినిమా తెరకెక్కించిన సంజయ్ లీలా బన్సాలీ మరోసారి మాధురితో ప్రత్యేకగీతానికి శ్రీకారం చుట్టాడు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేతో తాను తెరకెక్కిస్తున్న 'రామ్ లీలా' కోసం మాధురీని బన్సాలీ ఒప్పించాడట.