: శిరోజాల రహస్యం
జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా పెడుతుందనే పెద్దల సామెతను ఓ స్టడీ నిరూపించింది. మహిళ తన జీవితకాలంలో 150 హెయిర్ స్టైల్స్ మారుస్తుందని పరిశోధకులు తేల్చారు. సంవత్సరానికి కనీసం రెండు చొప్పున మార్చడానికి స్త్రీ ఇష్టపడుతుందట. 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపే దాదాపు 100సార్లు తన శిరోజశైలిని మార్చిపడేస్తుందట. అలాగే సంవత్సారానికో రంగును తన జుట్టుకు పులమడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ స్టడీలో మనవాళ్లున్నట్లు లేరు. మనవాళ్లు సాధారణంగా అన్ని స్టైల్స్ మార్చకపోవచ్చు.