: విరిగిన కాళ్లతో ఒంటరి చిన్నారి ఎదురుచూపులు
డెహ్రడూన్ లోని డూన్ హాస్పిటల్లో ఓ చిన్నారి తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తోంది. ఉత్తరాఖండ్ బీభత్సంలో 21వ తేదీన రిషికేశ్-దేవప్రయాగ దారిలో విరిగిన కాళ్లతో ఒంటరిగా కనిపించిన ఈ చిన్నారిని రిషికేశ్ గవర్నమెంట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేశారు. అనంతరం డూన్ ఆసుపత్రికి తరలించారు. ఈ పాప రెండు కాళ్ల ఎముకలూ పలు చోట్ల విరిగిపోవడంతో కట్లు కట్టారు. ఈ చిన్నారి తల్లిదండ్రుల ఆచూకి దొరకడం లేదు. అయినవాళ్లెవరూ ఈ చిన్నారి తమదంటూ ఇంతవరకూ రాలేదు. దీంతో సామాజిక కార్యకర్తలు ఈ పాప తల్లిదండ్రులు, బంధువులను వెతికే పనిలో పడ్డారు.