: 3,000 మంది గల్లంతయ్యారు
ఉత్తరాఖండ్ వరదలలో గల్లంతైన వారి సంఖ్యపై అధికారిక వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 3,000 మంది ఆచూకీ లేదని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ కుమార్ ప్రకటించారు. గల్లంతైనవారి విషయంలో వారి బంధువులను మభ్య పెట్టదలచుకోలేదన్నారు. తప్పిపోయిన వారిని ఇంకెంత మాత్రం ఏరియల్ సర్వే ద్వారా గుర్తించడం సాధ్య పడదని స్పష్టం చేశారు. వాస్తవానికి గల్లంతైన వారి సంఖ్య అనధికారికంగా చూస్తే దీనికి రెట్టింపు ఉంటుందని భావిస్తున్నారు.