: చిటికెలో వీడియో తీయొచ్చు


మనం ఏదైనా వింతనో లేదా మరేదైనా సంఘటనను చూశామనుకో... దాన్ని మనం వీడియో తీసుకోవాలనుకుంటే మన చేతిలో వీడియో ఉండాలి. లేదా మన సెల్‌ఫోన్‌లో వీడియోకు సంబంధించిన సౌకర్యమైనా ఉండాలి. అయినా సదరు వీడియో ఆప్షన్‌లోకి వెళ్లి మనం వీడియో తీసుకోవడం మొదలుపెట్టేసరికి ఇక్కడ అసలు సంఘటన కాస్తా పూర్తయిపోతుంది. అలాకాకుండా మీ చుట్టూ జరిగే సంఘటనల్లో మీకు నచ్చిన లేదా అవసరమైన సంఘటనను రికార్డు చేయాలనుకుంటే మాత్రం మీ పోన్‌లో ఒక కొత్తరకం అప్లికేషన్‌ ఉండాల్సిందే. అప్పుడే కేవలం కొన్ని సెకన్ల సమయంలో వీడియో రికార్డు చేయొచ్చు.

హెర్డ్‌ అనే అప్లికేషన్‌ను మీ ఫోన్‌లో లోడ్‌ చేసుకుంటే అప్పుడు మీ ఫోన్‌ ఆన్‌లో ఉన్న సమయంలో మీరు రికార్డు చేయాలనుకున్న సంఘటనలను ఇట్టే రికార్డు చేసుకోవచ్చు. ఎలాగంటే మీ ఫోన్‌ తీసి ఓకే కొడితే మీకు కావాలసిన సమాచారం అందులో నిక్షిప్తం అయిపోతుంది. అసలు ఈ కొత్తరకం అప్లికేషన్‌ను లోడ్‌ చేసుకుంటే మీ ఫోన్‌ నిరంతరం మీ చుట్టూ జరిగే సంఘటనలను వీడియో తీస్తుంటుంది. ఐదు నిమిషాల పాటు వీడియో తీయడం తర్వాత వాటిని బఫరింగ్‌ చేయడం చేస్తుంది. కాబట్టి మీ ఫోన్‌ వీడియో తీసిన తర్వాత మీరు ఓకే కొట్టారనుకోండి అప్పుడు మీకు కావలసిన వీడియో అట్టే ఉంటుంది. లేదంటే ఐదు నిమిషాలకు ఆ వీడియో డిలిట్‌ అయిపోతుంది. ఈ అప్లికేషన్‌లో మీరు తీసిన వీడియోలను సోషల్‌ సైట్లలో అప్‌లోడ్‌ చేసుకునే వీలు కూడా ఉంది. పన్నెండు నిమిషాల పాటు రికార్డింగ్‌ సదుపాయం ఉన్న ఈ హెర్డ్‌ వెర్షన్‌ ఉచితంగా లభిస్తోంది. అలాకాకుండా ఐదు నిమిషాల పాటు రికార్డింగ్‌ చేసే సదుపాయం కావాలనుకుంటే మాత్రం ఆపిల్‌ స్టోర్‌నుండి ఈ అప్లికేషన్‌ రూ.120 కి లభిస్తోందట.

  • Loading...

More Telugu News