: ఆ కాలంలోనే మనిషి గురి నేర్చుకున్నాడు


గురిచూసి కొట్టడం అనే సామర్ధ్యాన్ని ఇప్పుడు నేర్చుకున్న విషయం కాదు. నిజానికి మనిషికి ఈ సామర్ధ్యం సుమారు ఇరవై లక్షల సంవత్సరాల క్రితమే ఉంది. ఎందుకంటే అప్పటి మానవుడు మాంసాహారి. వేటాడడం ద్వారా జంతువులను చంపి తన ఆహారంగా సమకూర్చుకునేవారు. అందుకే అప్పటి మానవుల భుజాకృతి వారి లక్ష్యాన్ని గురితప్పకుండా ఛేదించేలా పదునైన వస్తువులను విసిరేయడానికి అనువుగా ఎంతగానో ఉపకరించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జార్జి వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం ఇరవై లక్షల ఏళ్ల క్రితం ఉన్న మానవుల భుజాలు, చేతుల తీరు గురించి విశ్లేషించారు. ఈ విశ్లేషణలో ఆ కాలంలో మానవులు మాంసాహారులైన కారణంగా గురి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించేందుకు వీలుగా వారి భుజాలు, చేతుల తీరు ఎంతగానో ఉపకరించిందని తేలింది. తర్వాత కాలంలో మానవ పరిణామ క్రమంలో వారి మెదడు పరిమాణం పెరగడం వంటి పలు మార్పులు చోటుచేసుకున్నాయి. మానవుల భుజాలు వెడల్పుగా కావడం, నడుము భాగం పెరగడం, భుజాస్థి తీరు మారడం వంటివి జరిగాయి. ఈ భుజాస్థి తీరు మారడం వల్లే మానవులు గురిచూసి విసిరే సామర్ధ్యాన్ని సంతరించకున్నారని ఈ పరిశోధనలో తేలింది.

  • Loading...

More Telugu News