: రాష్ట్ర సాధన సభ కాదు, సోనియా భజన సభ: సీపీఐ నారాయణ


హైదరాబాద్ లో ఈ నెల 30న కాంగ్రెస్ జరుపతలపెట్టిన బహిరంగ సభ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర సాధన సభ కాదని, సోనియా భజన సభ అని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుకార్లకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ వెన్నంటి ఉంటూ కాంగ్రెస్ నేతలు ఈ సభ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.

కొత్త మద్యం పాలసీ సరైంది కాదన్న నారాయణ, దీని వల్ల కొత్త మద్యం మాఫియా పుట్టుకొస్తుందని అన్నారు. మద్యం పాలసీకి వ్యతిరేకంగా జూలై 1న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నాలు, ఆందోళనలు చేస్తామని తెలిపారు. ఉత్తరాఖండ్ వరద బాధితుల సహాయార్ధం విరాళాలు సేకరిస్తున్నామని, సేకరించిన మొత్తాన్ని ఢిల్లీకి అందజేస్తామని నారాయణ తెలిపారు.

  • Loading...

More Telugu News