: వెంటిలేటర్ పై 'నల్లసూరీడు'
దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగించిన నల్ల సూరీడు నెల్సన్ మండేలా (94) పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటలేటర్ సాయంతో శ్వాస తీసుకుంటున్నారు. ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కారణంగా మండేలా గత మూడువారాలుగా ప్రిటోరియా హార్ట్ క్లినిక్ లో చికిత్స పొందుతున్నారు. మండేలా కిడ్నీలు కూడా పనిచేయడంలేదని, రెండ్రోజులకు ఓసారి డయాలసిస్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని సన్నిహిత వర్గాలంటున్నాయి. వైద్యులు మాత్రం ఈ విషయమై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.