: డొకోమో డేటా చార్జీలు మరింత చౌక
టాటా డొకోమో తన 2జి, 3జి డేటా చార్జీలను 90 శాతం వరకూ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 19 సర్కిళ్లలో జూలై 1 నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుంది. 2జి, 3జి నెలవారీ ప్లాన్ లలో పరిమిత వినియోగం దాటిన తర్వాత ప్రస్తుతం కేబీ డేటాకు 10 పైసలు చార్జీ ఉండగా, ఇకపై అది ఒక పైసకు తగ్గిపోయింది. ఎయిర్ టెల్ రెండు సర్కిళ్లలో 2జి డేటాను తగ్గించడం, వొడాఫోన్, ఐడియా కూడా పలు సర్కిళ్లలో డేటా చార్జీలను గణనీయంగా తగ్గిండంతో డొకోమో కూడా అదే బాటలో నడిచింది.