: అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా ... ఓప్రా
ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఓప్రా విన్ ప్రే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా ఎంపికయ్యారు. బుధవారం ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన జాబితాలో ఈ టాక్ షో వ్యాఖ్యాత నెంబర్ వన్ సెలబ్రెటీగా నిలిచారు. ఈ జాబితాలో టాప్-10లో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు చోటు దక్కించుకున్నారు. పాప్ సింగర్ లేడీ గాగా రెండోస్థానంలో నిలిచింది. తరువాత స్థానాలను వరుసగా దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్, పాప్ సింగర్స్ బియాన్స్, మడోన్నా కైవసం చేసుకున్నారు. గతేడాది నెంబర్ వన్ స్థానంలో నిలిచిన జెన్నిఫర్ లోపెజ్ ఈ సారి 12వ స్థానానికి పడిపోయింది.