: పరభాషా నటులకు హరీష్ శంకర్ ఝలక్!
తన సినిమాల్లో ఇక నుంచి పర భాషా నటుల్ని తీసుకోనని దర్శకుడు హరీష్ శంకర్ నిర్ణయించుకున్నాడు. వాళ్లు నటన కంటే తెలుగు పలకడంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని అన్నాడు. 'తెలుగు రాని వారితో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. వారు నటించడం కంటే తెలుగు భాషను తప్పులు లేకుండా పలకడంపైనే శ్రద్ధ చూపిస్తున్నారు. అవి సరిగ్గా పలికేసరికి వాళ్ల ముఖంలో హావభావాలు అడ్డం తిరిగిపోతున్నాయి. అందుకే ఇక నుంచి నా సినిమాల్లో తెలుగు మాట్లాడడం వచ్చిన వారినే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను' అని హరీష్ శంకర్ వివరించాడు.