: టీమిండియాలో సరికొత్త ఛాంపియన్స్
చాంపియన్స్ ట్రోఫీ పుణ్యమా అని టీమిండియాకు సరికొత్త ఛాంపియన్స్ దొరికారు. శిఖర్ ధావన్ రెండేళ్ల క్రితం టీమిండియాలో చోటు దక్కించుకున్నప్పటికీ, సరైన ప్రదర్శన చేయని కారణంగా చోటుకోల్పోయాడు. టెస్టుల్లోనూ, ఐపీఎల్ లోనూ రాణించి, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా 'శత'క్కొట్టాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలవడమే కాకుండా, ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇక బ్యాట్స్ మన్ ఆల్ రౌండర్ గా జట్టులో అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా బౌలర్ గా అద్వితీయ ప్రదర్శన చేశాడు. ఛాంపియన్స ట్రొఫీలో ప్రధాన బౌలర్లందరికంటే ఎక్కువ(12) వికెట్లు తీసి, గోల్డెన్ బాల్ అందుకున్నాడు. దీంతో టీమిండియాకు మరో రెండు అణిముత్యాలు దొరికినట్టేనని సెలక్టర్లు సంబరపడిపోతున్నారు.