: ఇక 'సత్యం' కధ సమాప్తం!
సత్యం కధ కంచికి చేరింది. సత్యం అవినీతి కధతో మేల్కొన్న ప్రభుత్వం, వెంటనే సత్యం కంపెనీని మహీంద్రా కంపెనీకి అప్పగించి, 'మహేంద్రా సత్యం'గా ఊపిరిలూదింది. దీంతో నేటి వరకూ అది మహీంద్రా సత్యంగా పనిచేసి ఉద్యోగులకు, వ్యాపారులకు సేవలందించింది. అయితే, మహీంద్రా సత్యం, టెక్ మహీంద్రా విలీనానికి మార్చి 12 న రెండు సంస్థలు పంచ్చజెండా ఊపాయి. దీనికి బాంబే హైకోర్టు అనుమతించిన పిదప, జూన్ 11న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనుమతి కూడా లభించింది. దీంతో అధికారికంగా నేడు విలీనం పూర్తి చేశారు.
నాలుగేళ్లుగా విశేషంగా కృషి చేసి చట్టపరమైన, ఇతర అంశాలను పూర్తి చేసి, షేర్ హోల్డర్లకు తగిన విలువ లభించేలా కృషి చేయడంతో సత్యం కంప్యూటర్స్ మహీంద్రా సత్యంగా మారి తుదకు మహీంద్రా టెక్ లో విలీనమై చివరికి తన అస్తిత్వాన్ని కోల్పోయింది. దీంతో సత్యం కధ కంచికి చేరగా, టెక్ మహీంద్రా దేశంలోని సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఐదో అతిపెద్ద సంస్థగా ఆవిర్భవించింది.