: తప్పిపోయిన తెలుగువారి లెక్క 1250?


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తప్పిపోయిన తెలుగువారు భారీ స్థాయిలోనే ఉన్నారు. విపత్తు సంభవించి వారం రోజులు దాటిపోయినా ఇప్పటికీ 1250 మంది ఆచూకీ లేదు. ఫోన్లకు అందుబాటులో లేని వారి సంఖ్య ఇది. సోమవారం సాయంత్రానికి రాష్ట్రంలోని పలు జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకు అందిన సమాచారం మేరకు మొత్తం 2,750 మంది వరకు తెలుగు వారు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయారు. 1500 మంది తిరిగి ఢిల్లీలోని ఏపీ భవన్ కు సురక్షితంగా చేరుకున్నారు. మిగతా వారి ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. అయితే, అన్ని జిల్లాల నుంచి మరింత సమాచారం లభిస్తే బాధితుల సంఖ్య ఇంకా పెరగొచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News