: మృతులు 15 వేలకు చేరవచ్చు


ఉత్తరాఖండ్ వరదల్లో మరణించిన వారి సంఖ్య 5వేలుగా ఉంటుందన్న అంచనాలు తారుమారవుతున్నాయి. సహాయక కార్యకలాపాలలో పాల్గొంటున్న వారు మాత్రం ఈ సంఖ్య ఇంకా భారీగా ఉంటుందంటున్నారు. కేదార్ నాథ్ క్షేత్రం, సమీప ప్రాంతాలలో సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. మృతుల సంఖ్య 15,000 వరకూ చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు. అంతిమంగా ప్రళయం బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 10 నుంచి 15 వేల మధ్యలో ఉండవచ్చని అక్కడి వలంటీర్లు కూడా అభిప్రాయపడుతున్నారు. గౌరీకుండ్ ప్రాంతంలో సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్న పర్వతారోహకుడు విష్ణు, తాను ఇప్పటి వరకూ 2,000 మృతదేహాల వరకూ చూసి ఉంటానని చెప్పారు. దీన్నిబట్టి మృతుల సంఖ్య నిజంగా ఆ స్థాయిలోనే ఉండవచ్చని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు నిరోధక శాఖ మంత్రి యాష్ పాల్ ఆర్య మాట్లాడుతూ మృతులు 5వేల వరకూ ఉండవచ్చని ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News