: తెలుగువారు ఇంటికి చేరేవరకూ ఢిల్లీ వీడను: బాబు
ఉత్తరాఖండ్ కు వెళ్లిన తెలుగు వారు క్షేమంగా ఇంటికి చేరేవరకూ ఢిల్లీ నుంచి కదిలేది లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులకు మానవత్వంతో సాయం అందిద్దామనే ఢిల్లీకి వచ్చానన్నారు. బాధితులకు వెంటనే సాయం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మరోసారి విమర్శించారు. తెలుగు వారి పట్ల వివక్ష చూపారని ఆరోపించారు.