: ఇమ్రాన్ హష్మితో మళ్లీ చేస్తా: విద్యాబాలన్
గతంలో ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మితో కలసి 'డర్టీ పిక్చర్' సినిమాలో విద్యాబాలన్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి 'ఘన్ చక్కర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ తో మరో సినిమాలో నటించాలనుందంటోంది విద్య. 'తనతో ఎన్ని సినిమాలు చేసినా మరో సినిమాలో నటించాలనుంటుంది, ఇమ్రాన్ అటువంటి నటుడు, మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా' అంటూ మనసులో కోరికను చెప్పింది విద్యాబాలన్.