: తుది దశలో తెలంగాణ అంశం: టీ కాంగ్రెస్ ఎంపీలు
తెలంగాణ అంశం చివరి దశకు చేరిందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. ఇందుకు ఢిల్లీలో జరుగుతున్నకోర్ కమిటీ సమావేశాలే నిదర్శనమని వారు చెప్పారు. అయితే తెలంగాణ విషయంలో అధిష్ఠానంపై తమ ఒత్తిడి కొనసాగుతూనే ఉందని కరీంనగర్ లో వారు ఉద్ఘాటించారు.
తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరన్న కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు, తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ లను కోరామని తెలిపారు.