: కలెక్టర్ నాలుగేళ్ల సంపాదన 300 కోట్లు: టీడీపీ నేత ఆరోపణ


నెల్లూరు కలెక్టర్ గా పని చేసిన కేవీపీ బంధువు నాలుగేళ్లలో 300 కో్ట్ల రూపాయలు సంపాదించారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో మాట్లాడిన ఆయన వైఎస్ హయాంలో అధికారుల అవినీతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం కలెక్టరే 300 కోట్ల రూపాయలు స్వాహా చేస్తే, ఇక వైఎస్ ఎంత దోచుకుని ఉంటారో ఊహించుకోవచ్చని ఆయన అన్నారు. కృష్ణపట్నం భూ ఆక్రమణను జగన్ కేసులో భాగంగా సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సహజవనరులను ధారాదత్తం చేసే అధికారం వైఎస్ కు ఎవరిచ్చారని ఈ సందర్భంగా సోమిరెడ్డి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News