: ఏబీఎన్ పై కేటీఆర్ పరువునష్టం దావా


ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్, ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అసత్య కథనాలతో తన పరువుకు నష్టం కల్గించారని అందులో పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఒక భూ వివాదం సెటిల్ మెంట్ వ్యవహారంలో కేటీఆర్ కు పాత్ర ఉందని, వివాద పరిష్కారానికి 5 కోట్ల రూపాయల డీల్ కుదిరిందంటూ ఏబీఎన్ చానల్ గతవారం ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దీనిపై క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ అప్పుడే ప్రకటించారు.

  • Loading...

More Telugu News