: బ్రిటన్ వెళ్లాలంటే 2.7లక్షల బాండ్ ఇచ్చుకోవాల్సిందే
ఈ ఏడాది నవంబర్ తర్వాత బ్రిటన్ వెళ్లే భారతీయులు విధిగా 2.7లక్షల రూపాయలకు సరిపడా బాండ్ అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమర్పించుకోవాలి. నిర్ణీత కాలం లోపు బ్రిటన్ నుంచి స్వదేశానికి వెళితే దాన్ని తిరిగిచ్చేస్తారు. లేకుంటే ఆ బాండ్ కాస్తా బ్రిటన్ ప్రభుత్వం సొంతమైపోతుంది. బ్రిటన్ కు తాత్కాలిక వీసాతో వస్తున్న వారు స్వదేశాలకు వెళ్లకుండా ఉండిపోతున్న నేపథ్యంలో ఆ దేశ హోంశాఖ ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. ఇది ఆమోదం పొందితే నవంబర్ తర్వాత బ్రిటన్ వెళ్లే భారత్, శ్రీలంక, ఘనా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ పర్యాటకులు బాండ్ ఇచ్చుకోక తప్పదు.