: జైలు నుంచే శ్రీమతికి సంజయ్ నిత్య పలకరింపులు
అక్రమంగా ఆయుధాలు కలిగున్నందుకు జైలు శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన శ్రీమతిని మాత్రం నిత్యం పలకరిస్తూనే ఉన్నాడు. తన భార్య మాన్యతాదత్ కు ప్రతీరోజూ లేఖ రాస్తూనే ఉన్నాడు. మాన్యతాదత్ కూడా తన భర్త రాసిన లేఖకు బదులిస్తూ ప్రత్యుత్తరం పంపుతున్నారని జైలు వర్గాలు తెలిపాయి. సంజయ్ పుణెలోని ఎరవాడ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.