: 'యూపీలో పేలనున్న మోడీ మిసైల్'
భారతీయ జనతాపార్టీ ఎన్నికల ప్రచార సారధిగా మోడీ నియమితులు కావడం, మోడీ సన్నిహితుడు అమిత్ షా ఉత్తరప్రదేశ్ (యూపీ) వ్యవహారాల ఇంచార్జ్ గా నియమితులు కావడం ఆ రాష్ట్రంలో బీజేపీ జాతకాన్ని మార్చనుందా? అవుననే అంటున్నారు లక్నో యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగం అధిపతి, రాజకీయ విశ్లేషకుడు అయిన అశుతోష్ మిశ్రా. బీజేపీ ప్రయోగించిన మోడీ మిసైల్ యూపీలో పేలనుందని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారం సొంతం చేసుకోవాలంటే బీజేపీ యూపీలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని మిశ్రా చెప్పారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఈ రాష్ట్రంలో 85 స్థానాలకు గాను 52 చోట్ల గెలుపొందింది. 98లో జరిగిన ఎన్నికల్లో 57 సొంతం చేసుకుంది. కానీ, 2009లో మాత్రం 10 సీట్లకు పరిమితమైపోయింది.