: విశాఖలో లక్షమందితో ఒలింపిక్ డే రన్
విశాఖలో భారీ ఒలింపిక్ డే రన్ జరిగింది. నగరం నలుమూలల నుంచీ అసంఖ్యాకంగా ఈ రన్ కోసం తరలి వచ్చారు. ఇందులో విజయవాడ ఎంపీ, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు లగడపాటి రాజగోపాల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిన్నిస్ బుక్ లో చోటు కోసం ఒలింపిక్ డే రన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇందులో లక్షమంది వరకు పాల్గొన్నారని చెప్పారు.