: తిరుమలలో అక్రమ నిర్మాణాలపై వివరణ కోరిన హైకోర్టు
తిరుమలలో దుకాణాల కేటాయింపు, అక్రమ నిర్మాణాలకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ హైకోర్టు... తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో పాటు ప్రభుత్వానికీ నోటీసులు జారీ చేసింది. తిరుమలలో షాపుల నిర్మాణానికి చట్ట విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని, కనుక ఆయా దుకాణాల్ని కూల్చివేయాలని కోరుతూ చిత్తూరుకు చెందిన బాలాంజనేయులు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై టీటీడీ, ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.