: సోనాక్షి ముఖంపై ఉమ్మిన రణ్వీర్ సింగ్
బాలీవుడ్లో ఈ రోజు ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా కొంతమంది మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు లాలాజలం తుంపర్లుగా బయటకు వస్తుంటుంది. కొందరిలో అదో చెడ్డ అలవాటుగా కొనసాగుతుండగా, మరికొందరికి ఎప్పుడో ఓసారి అనుకోకుండా తుంపర్లు వచ్చేస్తుంటాయి. ఇలాగే బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఇప్పుడు దీంతో పెద్ద ఇబ్బందినే ఎదుర్కొంటున్నాడు. 'లూటేరా' సినిమాలో రణ్వీర్ - సోనాక్షి సిన్హా జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగులో ఓ డైలాగ్ చెబుతున్నప్పుడు రణ్వీర్ నోటినుంచి అనుకోకుండా లాలాజలం తుంపర్లుగా సోనాక్షి ముఖంపై పడింది. దీంతో సోనాక్షి వెంటనే ఆగ్రహానికి గురై షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిపోయింది. 'నాపై చాలా కోపంతో సెట్ నుంచి సోనాక్షి వెళ్లిపోయింది. ఇలా ఇంతకుముందెప్పుడూ జరగలేదు' అంటూ రణ్వీర్ వాపోతున్నాడు.