: ఆకలితో చనిపోతున్న యాత్రికులు


ఉత్తరాఖండ్లో ఆకలితో కొంతమంది చనిపోయినట్లు సురక్షితంగా బైటపడ్డ యాత్రికులు పీటీఐకి చెబుతున్నారు. ఇంకా మరికొంతమంది కూడా ఆకలితోనే చనిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. గౌరీకుండ్ - కేదార్‌నాథ్ మధ్య ఉన్న యాత్రికులకు సహాయ కార్యక్రమాలు అందడంలేదు. సోన్ ప్రయాగ్ వద్ద వందలమంది నిరీక్షిస్తున్నారు. వారంరోజులుగా ఆహారం, తాగునీరు వారికి అందడంలేదు. తప్పిపోయిన బంధువుల కోసం చాలా మంది యాత్రికులు అడవుల్లో వెతుకున్నారు. గౌరీకుండ్, భైవర్‌ఛట్టి, జంగల్‌చెట్టి, గరూచీల్లో విషాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News