: యాత్రికులను వేగంగా రక్షించండి: సీఎం
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చిక్కుకుపోయిన తెలుగు వారిని తక్షణమే రక్షించి వెనక్కి తీసుకురావాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధికారులు, మంత్రులను ఆదేశించారు. ఈ మేరకు సీఎం ఈ ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో ఉన్న రాష్ట్ర మంత్రులతో సీఎం ఫోన్లో మాట్లాడి సూచనలు ఇచ్చారు. మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.