: శంషాబాద్ పంచాయతీ ఆదర్శ నిర్ణయం


నగర శివారులోని శంషాబాద్ లో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. కలెక్టర్ వాణీమోహన్ ఆదేశంతో పంచాయతీ అధికారులు ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నిషేధించాలని నిర్ణయించుకున్నారు. జూలై 10 తరువాత ఎవరైనా ప్లాస్టిక్ విక్రయించినా, కొనుగోలు చేసినా వారికి అపరాధ రుసుం విధిస్తున్నట్టు ప్రకటించారు. ప్లాస్టిక్ అమ్మినవారికి 5 వేల రూపాయలు, కొన్నవారికి 500 రూపాయాల చొప్పున జరిమానా విధించనున్నట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. జూలై 10 తరువాత టాస్క్ ఫోర్స్ బృందాలు దుకాణాలపై దాడులు నిర్వహిస్తాయని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించిన పట్టణంగా విజయనగరం జిల్లా బొబ్బిలి ఆదర్శంగా నిలుస్తోంది.

  • Loading...

More Telugu News