: స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం లైన్ క్లియర్


సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతమున్నరిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎప్పటిలానే  బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజ్వేషన్లు కొనసాగించాలని పేర్కొంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర సర్కారు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీనిని ఈ రోజు విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. దీంతో ఎన్నికలకు అడ్డంకులు తొలగినట్లేనని భావిస్తున్నారు. చివరిసారిగా రాష్ట్రంలో 2006లో ఎన్నికలు జరిగాయి. 

  • Loading...

More Telugu News