: కంగారూలను దాదా దంచేసేవాడు: లారా


టీమిండియాలో తనకు ఇష్టమైన కెప్టెన్ సౌరవ్ గంగూలి అని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా చెప్పాడు. నాయకత్వ లక్షణాలపై ముంబైలో ఏర్పాటైన కార్యక్రమానికి లారా వచ్చి ప్రసంగించాడు. 'గంగూలి నా ఫేవరెట్ కెప్టెన్. ఆస్ట్రేలియాలోనే ఆ జట్టును ఢీ కొనే సమయంలో గంగూలి నాయకత్వ లక్షణాలు నన్ను అబ్బురపరిచేవి. గంగూలి వ్యూహాలు, బాడీ లాంగ్వేజ్ అస్ట్రేలియన్లను ముప్పుతిప్పలు పెట్టేస్తుండేవి' అంటూ దాదాపై లారా ప్రశంసల జల్లు కురిపించాడు.

  • Loading...

More Telugu News