: జగన్ కేసు విచారణ జులై 1కి వాయిదా


అక్రమాస్తుల కేసులో జగన్ పై విచారణ ఇప్పట్లో ముగిసేట్టు కనిపించడంలేదు. జగన్ పై మొత్తం 5 ఛార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ, ఇప్పటివరకు మూడు ఛార్జిషీట్లపై దర్యాప్తు పూర్తి చేసింది. ఇక మరో రెండు చార్జిషీట్లపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలో దాల్మియా వ్యవహారానికి సంబంధించిన చార్జిషీటుపై విచారణ చేపట్టిన సీబీఐ న్యాయస్థానం.. నేడు జగన్ తో పాటు విజయసాయిరెడ్డిని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. వాదనలు విన్న అనంతరం విచారణను జులై 1కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. కాగా, జగన్, విజయసాయిరెడ్డి ప్రస్తుతం రిమాండ్ పై చంచల్ గూడ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News