: టీఆర్ఎస్, టీడీపీ బాహాబాహీ
టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చంద్రబాబు నాయుడుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు రంగంలోకి దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వెంటనే తేరుకున్న పోలీసులు లాఠీ ఝుళిపించి రెండు వర్గాలను చెదరగొట్టి 14 మంది టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.