: సాయం కోసం 35వేల మంది... వేలాది మంది గల్లంతు


గంగమ్మ ప్రళయరూపానికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వందల మంది చనిపోగా.. వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభ్యం కావడం లేదు. యాత్రలకు వెళ్లిన తమవారి ఆచూకీ కోసం బంధువులు హెల్ప్ లైన్ కేంద్రాలకు పదే పదే ఫోన్లు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 33వేల మందిని రక్షించగా.. ఇంకా 35వేల మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని రక్షించడం కోసం ఆర్మీ, ఐటీబీపీ, విపత్తు నివారణ దళాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. గంగ ప్రవాహధాటికి వేలాది మంది కొట్టుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా మంది ఆచూకీ దొరకకపోవడానికి ఇదే కారణమని భావిస్తున్నారు. మరికొన్ని రోజులు ఆగితే ఇంకొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

  • Loading...

More Telugu News