: హోండా నుంచి నయా డ్రీమ్ యుగా, సీబీ ట్రిగ్గర్


ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హోండా సీబీ ట్రిగ్గర్ మోడల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. 150సీసీ సామర్థ్యంతో మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది. వీటి ధరలు (కోల్ కతా ఎక్స్ షోరూమ్) 71,147 రూపాయల నుంచి 80,908 రూపాయల మధ్య ఉన్నాయి. ఇక ఇప్పటికే మార్కెట్లో ఉన్న డ్రీమ్ యుగా మోడల్ కు సరికొత్త హంగులు జోడించి విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన మోడల్ 74 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని ఎక్స్ షోరూమ్ ధర 45,101 రూపాయలు.

  • Loading...

More Telugu News