: నన్ను అలా పిలవొద్దు: ఇషాంత్ శర్మ
భారత బౌలింగ్ దాడికి నాయకుడిగా తనను పిలవొద్దని పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ అంటున్నాడు. నిన్న జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సెమీస్ ఫైనల్లో ఇషాంత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్ లో ఇషాంత్ 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. 'ఎప్పుడూ ఇదే ఫలితాన్ని సాధించడానికి నేనేమీ దేవుడిని కాదు. ఒక్కో రోజు ఇలా ఉంటుందంతే. దానికే భారత బౌలింగ్ విభాగానికి నాయకుడిగా నన్ను అభివర్ణించవద్దు. అందరూ తలో చేయి వేయడంతో ఈ విజయం సాధ్యమయింది. ఇది అందరి శ్రమ ఫలితం' అంటూ వినమ్రత చాటుకున్నాడు ఇషాంత్.