: టాప్ 100 యువ యూనివర్సిటీలలో మనదొక్కటీ లేదు
మన యూనివర్సిటీల గొప్పతనం మరోమారు వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా యంగ్ యూనివర్సిటీలు అంటే 50ఏళ్ల లోపు వయసు కలవాటిలో 100 అత్యుత్తమైన వాటిని జల్లెడ పట్టింది బ్రిటన్ కు చెందిన టైమ్ పత్రిక. ఆ వందలో మన యూనివర్సిటి ఒక్కటి కూడా చోటు సాధించలేకపోయింది. టీచింగ్, రీసెర్చ్, పరిశ్రమలతో అనుసంధానం తదితర అంశాల ఆధారంగా 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ఎంపిక జరిగింది. దక్షిణ కొరియాకు చెందిన పోహంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నంబర్ 1 యూనివర్సిటీగా ఎంపికైంది. స్విట్జర్లాండ్ కు చెందిన ఎకోల్ పాలిటెక్నిక్ రెండో స్థానంలో, మూడో స్థానంలో దక్షిణ కొరియా అడ్వాన్డ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయి. బ్రిటన్ కు చెందిన 18, ఆస్ట్రేలియాకు చెందిన 13, అమెరికాకు చెందిన 8, ఫ్రాన్స్ కు చెందిన 7 విశ్వవిద్యాలయాలకు ఇందులో చోటు లభించింది.