: నేడు స్వస్థలాలకు 450 మంది తెలుగు యాత్రికులు
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకుని క్షేమంగా బయటపడిన 450 మంది తెలుగువారు గురువారం రాత్రికి ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకున్నారు. నెల్లూరు, విజయవాడ, తాడిపత్రి తదితర ప్రాంతాలకు చెందిన వారు వీరిలో ఉన్నారు. నేటి సాయంత్రం ఢిల్లీ నుంచి రైలులో వీరందరినీ రాష్ట్రానికి పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.