: మొక్కలతో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు


మనుషుల్లో ఉండే కొలెస్టరాల్‌ను మొక్కలతో తొలగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనలో కొలెస్టరాల్‌ పెరగడం వల్ల అనారోగ్యాల బారిన పడతాం. అయితే ఈ కొలెస్టరాల్‌ను తొలగించేందుకు మొక్కల్లోని ఫైటోస్టెరాల్‌ అణువులు బాగా ఉపయోగపడతాయని, వీటికి కొలెస్టరాల్‌ను తగ్గించే సామర్ధ్యం ఉందని నిజానికి 1950 లోనే గుర్తించారు. ఈ ఫైటో స్టెరాల్‌ అణువులకు నీటిలో కరిగిపోయే గుణం లేని కారణంగా వీటిని వినియోగించడం అప్పట్లో సాధ్యం కాలేదు. అయితే బోస్టన్‌ లోని బ్రాండెయిజ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డేనియల్‌ పెర్ల్‌మ్యాన్‌ ఈ ఫైటోస్టెరాల్‌ అణువులను ఆహారపదార్ధాల్లోను, పానీయాల్లోను కలవడానికి వీలుగా కల్పించే విధానాన్ని కనుగొన్నారు. దీంతో ఫైటోస్టెరాల్‌ మనుషుల్లోని కొవ్వు స్థాయిలను గణనీయంగా తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సాధారణంగా ఫైటోస్టెరాల్‌ అణువులు, మనుషుల్లోని కొలెస్టరాల్‌ అణువులు రెండూ ఒకేలా ఉంటాయి. అయితే ఇవి జంతువుల్లో మాత్రం పేగుల్లో కలిసిపోయినపుడు కొలెస్టరాల్‌ అణువులు రక్తంలో కలవకుండా బయటికి వెళ్లిపోతాయి. మనుషుల్లో మాత్రం అట్టే నిలిచిపోతాయి. ఫైటోస్టెరాల్‌కు నీటిలో కరిగే గుణం లేనికారణంగా వీటి గురించి తెలిసినా వాటిని అప్పట్లో ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడు వీటికి గ్లిజరిన్‌ అణువులు అంటుకునేలా చేయడంతో అవి మనుషుల్లోని కొలెస్టరాల్‌ని రక్తంలో కలవకుండా బయటికి పంపేస్తాయని పెర్ల్‌మ్యాన్‌ చెబుతున్నారు. ఫైటోస్టెరాల్‌ను గ్లిజరిన్‌ ను రెండిటినీ కలిపి వేడిచేయడం వల్ల ఫైటోస్టెరాల్‌లోని నీటి అణువులు విడిపోయి, వాటి స్థానాన్ని గ్లిజరిన్‌ అణువులు ఆక్రమిస్తాయి. దీంతో ఇవి పానీయాల్లోను, ఆహారపదార్ధాల్లోను కలిసిపోయేలా మారతాయని పెర్ల్‌మ్యాన్‌ చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని ప్రయోగశాలలో పరీక్షించగా కొలెస్టరాల్‌ను తగ్గించడంలో మంచి ఫలితం కనిపించిందని ఆయన చెబుతున్నారు.

  • Loading...

More Telugu News