: 'చార్ ధామ్' బాధితులకు చిరంజీవి పరామర్శ
ఉత్తర కాశీ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగువారిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి నేడు పరామర్శించారు. వివిధ శిబిరాల్లో తలదాచుకున్న వారిని చిరంజీవి ఈ మధ్యాహ్నం కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ వరదలను జాతీయ విపత్తుగా పరిగణించాలని కేంద్రాన్ని కోరతామని తెలిపారు. అంతేగాకుండా, ఉత్తరకాశీ వద్ద రోప్ వే నిర్మిస్తామని అన్నారు.