: పేదవాడి ఆదాయం 17 రూపాయలే: జాతీయ సర్వే


దేశ సంపద ఊహకందని విధంగా పెరుగుతోంది. తరాలు మారుతున్నాయి. కానీ పేదవాడి జీవనప్రమాణం ఏమాత్రం మారలేదని నేషనల్ శాంపుల్ సర్వే వెల్లడించింది. తాజాగా ఈ సంస్థ వెల్లడిచేసిన సర్వే నివేదికలో దేశం ఉసూరుమనాల్సిన నిజాలు బయటపడ్డాయి. 2011 జూలై నుంచి 2012 జూన్ సంవత్సర కాలానికి గాను ఎన్.ఎస్.ఎస్ ఈ సర్వే చేసింది.

ఈ సర్వే ప్రకారం గ్రామంలో నివసించే నిరు పేదవాడు 17 రూపాయలతో రోజును గడిపేస్తుండగా, పట్టణంలో బతికే నిరుపేద 23 రూపాయలతో రోజంతా బతికేస్తున్నాడు. గ్రామీణ పేదవాడి నెల ఖర్చు 521 రూపాయల 44 పైసలు. పట్టణ పేదవాడిది 700.50 పైసలు. అదే సమయంలో తొలి 5 శాతం గ్రామీణ సంపాదనపరులు నెలకు 4,481 రూపాయలు ఖర్చు చేస్తుండగా, పట్టణవాసులు 10,282 రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News