: వెయ్యి డప్పులు, లక్ష చెప్పులతో.. కేసీఆర్ పై ఉద్యమం
ఉద్యమం ముసుగులో తెరాస అధినేత కేసీఆర్ చేస్తున్న దందాలను తాను బయటపెడతానని తెరాస బహిష్కృత నేత చింతా స్వామి తెలిపారు. తెరాస నేత కేటీఆర్ ఉద్యమం పేరుతో అక్రమాలు చేస్తున్నట్లు మీడియాలో ప్రస్తుతం వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ భాగోతాలు తాను బైటపెడతానని చింతా స్వామి ప్రకటించారు.
'తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గోలేదని కేసీఆర్ తప్పడు ప్రచారం చేస్తున్నారు. నేను ఆయనకు బహిరంగ లేఖ రాశాను. నేను లేఖలో లేవనెత్తిన అంశాలకు కేసీఆర్ జవాబు చెప్పకపోతే వచ్చేనెల 7న వెయ్యి డప్పులు, లక్ష చెప్పులతో ఆయనపై తిరుగుబాటు ఉద్యమం చేస్తాను. ఉద్యమం ముసుగులో కేసీఆర్ చేస్తున్న దందాలు, బెట్టింగులు వచ్చే పదినెలల్లో నెలకొకటి చొప్పున పది వాస్తవాలు బయటపెడతాను' అంటూ కేసీఆర్ ను చింతా స్వామి హెచ్చరించారు.